సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియాతో మాకు సంబంధం లేదన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందో తేలుస్తారని ప్రభాకర్ రెడ్డి సూచించారు.

మా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాదాగిరీ చేయాలనుకున్నారని.. కేతి రెడ్డి మా ఇంట్లోకి వస్తున్నా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

వికలాంగుడైన మా కంప్యూటర్ ఆపరేటర్‌ను కొట్టి వెళ్లిపోయారని.. ఇవాళ్టీ గొడవపై తాము ఫిర్యాదు కూడా చేయదలచుకోలేదని జేసీ స్పష్టం చేశారు. మా ఇంటికి కొడవళ్లు కూడా తెచ్చారని, వాటితో ఏం పని అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడాలని ఆయన సూచించారు. 

Also Read:తాడిపత్రిలో టెన్షన్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

కాగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆగ్రహంతో నేరుగా జేసీ ఇంటికి వెళ్లారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జేసీ అనుచరులపై మండిపడ్డారు.

అక్కడితో ఆగకుండా ఇద్దరు యువకులపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇదే సమయంలో.. పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చీలో కూర్చోవడంతో జేసీ అనుచరులు ఆ కుర్చీని తగలబెట్టారు.