తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేకల కాపరి అవతారం ఎత్తారు. గురువారం నాడు తాడికొండ మండలం దామర పల్లి  గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో... రహదారిపై భారీగా మేకలు కనిపించాయి. 

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేకల కాపరి అవతారం ఎత్తారు. గురువారం నాడు తాడికొండ మండలం దామర పల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో... రహదారిపై భారీగా మేకలు కనిపించాయి.

"

వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే శ్రీదేవి, తలపాగా కట్టి, కర్ర చేత బట్టి కాసేపు మేకల కాపరిగా మారిపోయారు. సరదాగా మేకల్ని ఎత్తుకున్నారు. కర్రతో మేకల్ని అదిలిస్తూ కాసేపు గడిపారు. 

అయితే అటుగా వెళుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే ఏంటి మేకలు కాయడం ఏంటని నివ్వెరపోయారు.