అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రోజుకో వివాదంలో చిక్కుకొంటున్నారు.కొన్ని రోజుల క్రితం వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. వీరిద్దరూ పార్టీ నుండి సస్పెండ్ కావడానికి ఎమ్మెల్యే శ్రీదేవి కారణమని బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ నుండి  బహిష్కరణకు గురైన శృంగారపాటి సందీప్ ఓ ఆడియో సంభాషణను మీడియాకు వివరించాడు.ఎమ్మెల్యే శ్రీదేవికి, సందీప్ కు మధ్య జరిగిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గురువారం నాడు ఈ ఆడియో సంభాషణను సందీప్ విడుదల చేశారు. అగ్రకులాల నేతలు మనల్ని ఎలా వాడుకొంటారో  ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో ఉంది.

రెడ్డి సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే తూర్పారబట్టారు. ఏస్సీలు, బీసీలు ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఈ ఆడియోలో ఉంది.  రెడ్లు అనేవాళ్లు చాలా డేంజర్ అని శ్రీదేవి వ్యాఖ్యానించినట్టుగా ఉంది.

మనం వారికి అడ్డురాకుండా ఉండేందుకు ఏమైనా చేస్తారని శ్రీదేవి రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. 

స్థానిక నేతలతో ఎమ్మెల్యేకు ఉన్న విబేధాలను కూడ ఆమె ప్రస్తావించారు. ఈ ఆడియోలో ఎమ్మెల్యే జోగి రమేష్, అయోధ్య రాంరెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, వైసీపీ నేత అప్పిరెడ్డి పేర్లను ఆమె ఆ ఆడియోలో ప్రస్తావించారు.

సందీప్ విడుదల చేసిన ఆడియో ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పినట్టుగా ఉంది.అయితే నిజంగా ఈ మాటలు శ్రీదేవి మాట్లాడిందా.. ఆమె మాట్లాడినట్టుగా ఎవరైనా మాట్లాడారా అనేది కూడ తేలాల్సి ఉంది.

గతంలోనే సందీప్ ఒక ఆడియోను  విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఎమ్మెల్యే శ్రీదేవి తాడికొండ పోలీస్ స్టేషన్ లో నలుగురిపై ఫిర్యాదు చేసింది. తన మాజీ అనుచరుల నుండి తనకు ప్రాణహానీ ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని  ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.తన గొంతును మార్పింగ్ చేసి ఆడియోలు విడుదల చేస్తున్నారని కూడ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్యే శ్రీదేవి తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై సందీప్ సెల్పీ వీడియోను మీడియాకు విడుదల చేశారు.

also read:అదంతా మార్ఫింగే.. ఏ టెస్ట్‌కైనా రెడీ: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

సీఎం జగన్ తనను కాపాడాలని ఆ వీడియోలో కోరాడు. తనపై కేసులు పెట్టడంతో తాను  అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. తనకు చావు తప్ప మరో మార్గం కన్పించడం లేదన్నారు. శ్రీదేవికి కష్టకాలంలో అండగా ఉండి తాను మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సందీప్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

ఇంతకుముందు సందీప్, ఎమ్మెల్యే శ్రీదేవి మధ్య జరిగిన ఆడియో సంభాషణను మీడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

గతంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు పేకాట క్లబ్ లు నడిపించారని చెప్పారు. మనం కూడ పేకాట క్లబ్ నడిపిద్దామని సందీప్ తో శ్రీదేవి చెప్పినట్టుగా ఆడియోలో ఉంది. ఫిరంగిపురం మండలానికి చెందిన శివరామిరెడ్డి తమ మండలంలో పేకాట ఆడిద్దామని చెబుతున్నాడని ఆమె చెప్పినట్టుగా ఆడియోలో ఉంది. ఈ ఆడియో విడుదల లీక్ కావడంపై శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజాగా సందీప్ ఇవాళ మరో ఆడియోను విడుదల చేయడం సంచలనం రేపుతోంది.గతంలోనే విడుదల చేసిన ఆడియోలో తన గొంతును మార్పింగ్ చేసి ఆడియోను విడుదల చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఆడియో సంభాషణపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.