Asianet News TeluguAsianet News Telugu

సైరా మూవీ తెచ్చిన తంటా: డ్యూటీ మానేసి సినిమా చూసిన పోలీసులు,వేటు వేసిన ఎస్పీ

విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తూ సైరా మూవీ చూసిన ఆ ఆరుగురు ఎస్సైలపై వేటు వేశారు ఎస్పీ ఫకీరప్ప. ఆ ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు.

syeraa movie release effect:SP orders to send to VR six si's
Author
Kurnool, First Published Oct 2, 2019, 12:07 PM IST

కర్నూలు: సైరా సినిమా విడుదల ఆరుగురు ఎస్సైలను అడ్డంగా బుక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో అర్థరాత్రి నుంచే సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సైరా విడుదలైన థియేటర్ల వద్ద సందడి నెలకొంది. 

ఇకపోతే కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సైరా సినిమా తిలకించారు. ఈ విషయం ఎస్పీ కె.ఫకీరప్ప దృష్టికి వెళ్లింది. దాంతో ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. ఆరుగురు ఎస్సైలు సినిమాకు వెళ్లారా అనే అంశంపై ఆరా తీయగా వెళ్లినట్లు తేలింది. 

విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తూ సైరా మూవీ చూసిన ఆ ఆరుగురు ఎస్సైలపై వేటు వేశారు ఎస్పీ ఫకీరప్ప. ఆ ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వార్త కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.  

ఇకపోతే ఎస్సైలు మంగళవారం అర్థరాత్రి నుంచే హల్ చల్ చేశారని తెలుస్తోంది. కోయిలకుంట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆరుగురు ఎస్సైలు కలిసి రాత్రి విందు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కోయిల కుంట్ల పట్టణంలోని పాండు రంగా థియేటర్లో వేకువ జామున బెనిఫిట్ షో  చూశారు. 

విధులు పక్కనపెట్టి కాలేజీ స్టూడెంట్స్ లా సినిమాకు వెళ్లడంపై ఎస్పీ పకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. 
సినిమా చూసిన ఈ ఎస్సైలంతా ఒకే బ్యాచ్ కి చెందిన వారిగా తెలుస్తోంది. 

సినిమా చూసిన వారిలో కోయిలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి,  కోయిలకుంట్ల 2 యస్ ఐ నరేష్ కుమార్ బండి, ఆత్మకూరు ఎస్ ఐ వీటి వెంకటసుబ్బయ్య, రాచర్ల ఎస్ఐ ప్రియతమ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్సై జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్ఐ హరి ప్రసాద్, అవుకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి,  గోస్పాడు ఎస్సై నిరంజన్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ అశోక్ ఉన్నారు.    

థియేటర్ లో ఎస్సైలంతా హల్ చల్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వీరితోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డు సైతం సినిమా చూసినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో ఆరుగురు ఎస్సైల ఫోటోలు మాత్రమే రావడంతో వారిపై వేటు వేశారు. ఆరుగురు ఎస్సైలను వీర్ కి పంపడంతో వారంతా హుటాహుటిని కర్నూలు జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు.
 

సంబంధిత వీడియో

వేటు వేసిన సినిమా అభిమానం (వీడియో)...

Follow Us:
Download App:
  • android
  • ios