స్వర్ణలతకు ముగిసిన పోలీస్ కస్టడీ.. కమిషన్ కు ఆశపడి తప్పు చేశానని...

నోట్ల మార్పిడి కేసులో అరెస్టైన ఆర్ఐ స్వర్ణలత ఒక్కరోజు పోలీసు కస్టడీ ముగిసింది. కమీషన్ కు ఆశపడే తాను నోట్ల మార్పిడికి ఒప్పుకున్నట్లు స్వర్ణలత విచారణలో అంగీకరించినట్లు సమాచారం. 

Swarnalata Confession that she made a mistake by hoping commission, visakhapatnam - bsb

విశాఖపట్నం : నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయిన విశాఖ సిటీ రిజర్వ్ హోంగార్డ్స్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారుల ముందు ఈ మేరకు ఆమె అంగీకరించింది. నోట్ల మార్పిడి వ్యవహారంలో స్వర్ణలత ఏ4గా ఉంది. రిమాండ్ లో ఉన్న ఆమెను గురువారంనాడు పోలీసులు ఒక రోజు కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.  

కస్టడీ పూర్తైన తర్వాత శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్ కు తీసుకువెళ్లి.. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి జైలుకు పంపించారు. ఒకరోజు పోలీసు కస్టడీలో భాగంగా గురువారం ఉదయం స్వర్ణలతను జైలు నుంచి ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు. ఈ విచారణలో ఏ విషయాలు చెప్పిందనేది గోప్యంగా ఉంచారు ఉన్నతాధికారులు.  

పయ్యావులకు లోకేష్ కంటే బుర్రతక్కువని తేలిపోయింది.. మంత్రి అంబటి రాంబాబు

మొదట స్వర్ణలత విచారణకు పూర్తిస్థాయిలో సహకరించలేదు. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మొండిగానే ఉండి ముభావంగా ఉండిపోవడంతో.. గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. నగరంలోని ఓ నేత దగ్గర రెండు వేల నోట్లు ఉన్నాయని వాటిని త్వరగా మారిస్తే 10% కమిషన్ వస్తుందని స్వర్ణలతకు మరో నాయకుడి ద్వారా తెలిసింది.  

దీంతో తాను ఈ మోసానికి పాల్పడినట్లుగా ఒప్పుకుందని సమాచారం.  తన వాహన డ్రైవర్.. ఈ విషయంలో తనమీద ఒత్తిడి చేయడం వల్లనే డబ్బులకు ఆశపడినట్లుగా.. అక్కడికి వెళ్లినట్లుగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అవతలి వ్యక్తుల నుంచి రూ.500 నోట్లు తీసుకున్నానని,, అంతేతప్ప తన వాహనంలో ఎలాంటి 2000 నోట్లు  తీసుకువెళ్లలేదని,, స్వర్ణలత చెప్పినట్టు తెలుస్తోంది. కస్టడీలో విచారణలో భాగంగా సినిమా షూటింగులు, డాన్స్ వీడియోల మీద కూడా పోలీసులు ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios