పయ్యావులకు లోకేష్ కంటే బుర్రతక్కువని తేలిపోయింది.. మంత్రి అంబటి రాంబాబు
పోలవరంపై తమ ప్రభుత్వమే దృష్టి సారించిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారని విమర్శించారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు.
పోలవరంపై తమ ప్రభుత్వమే దృష్టి సారించిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. టీడీపీ హయాంలో స్పిల్ వే సగంలో వదిలేశారని విమర్శించారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు. స్పిల్ వే ను పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. డయాఫ్రమ్ వాల్ వరదల వల్ల కొట్టుకుపోలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వ అనుచిత నిర్ణయాల వల్లే కొట్టుకుపోయిందని విమర్శలు చేశారు. ఇది తాను నిరూపిస్తానని.. ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కాంట్రాక్టు రామోజీరావు బంధువు నుంచి పోయిందని కక్ష కట్టారని ఆరోపించారు.
దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కి మరమ్మత్తు చేయటమా? కొత్తది నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. పయ్యావుల కేశవ్‌కు తెలివి ఉందని అనుకునేవాడినని అన్నారు. పయ్యావులకు లోకేష్ కంటే బుర్రతక్కువని తేలిపోయిందని.. అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్ఈసీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. అన్నిస్థాయిల్లోనూ పనులను చెక్ చేసిన తర్వాతనే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు పయ్యావుల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా అంబటి విమర్శలు చేశారు. పవన్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందని ఆరోపించారు. పవన్‌కు ఎవరైనా చికిత్స చేసేవారుంటే ముందుకు రావాలని సెటైర్లు వేశారు.