కడప జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని చితకబాదిన స్వప్న బార్ సిబ్బంది...
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై కడపలోని స్వప్న బార్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. వారిని నడిరోడ్డులోకి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు.

కడప : కడప జిల్లా బద్వేల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానిక స్వప్న బార్ నిర్వాహకులు ఇద్దరు వ్యక్తులపై దౌర్జన్యం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని బార్ నుంచి రోడ్డు మీదికి లాగేశారు. ఆ తరువాత నడిరోడ్డుపై విచక్షణారహితంగా వారిని కొట్టారు బార్ సిబ్బంది. ఈ ఘటనను సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్న వారి మీద కూడా దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.