అల్లూరి జిల్లాలో పావురం సంచారం కలకలం రేపుతుంది. విలీన మండలాల్లో సంచరిస్తున్న పావురం కాలుకు జీపీఆర్‌ఎస్ ఉండటమే ఇందుకు కారణం. 

అల్లూరి జిల్లాలో పావురం సంచారం కలకలం రేపుతుంది. విలీన మండలాల్లో సంచరిస్తున్న పావురం కాలుకు జీపీఆర్‌ఎస్ ఉండటమే ఇందుకు కారణం. వివరాలు.. జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కింది. అయితే పావురానికి జీపీఆర్‌ఎస్‌ అమర్చినట్టుగా జాలర్లు గుర్తించారు. ఇందకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. జీపీఆర్ఎస్‌తో కూడిన పావురాన్ని వారికి అప్పగించారు. ఈ క్రమంలోనే పోలీసులు పావురం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.