చేతబడి చేశారనే అనుమానంతో.. ఇద్దరు తండ్రి కొడుకుల పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించారు. వాళ్ల పళ్లు బలవంతంగా పీకి.. ఇనుప రాడ్లతో కాళ్లు విరగ కొట్టారు. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు కి చెందిన రాజేశ్వరరావు(66) వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఎవరికైనా నలతగా ఉంటే.. తాయిత్తులు కట్టి నయం చేస్తూ ఉంటారు. అతని కుమారుడు రాజ్ కుమార్(35) ఓ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు.

కొద్దిరోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యం బారిన పడింది. దీంతో.. ఆమెకు రాజేశ్వరరావు తాయిత్తు కట్టాడు. అయినా.. ఆమె జబ్బు నయం కాలేదు. దీంతో.. తన భార్యకు రాజేశ్వరరావు చేతబడి చేశాడని.. ఆమె భర్త తన బంధువులతో కలిసి వెళ్లి దాడి చేశాడు. రాజేశ్వరరావు, అతని కుమారుడు రాజ్ కుమార్ పై దాడి చేసి.. పళ్లు పీకేసి.. ఇనుపరాడ్లతో కొట్టి కాళ్లు, చేతులు విరిచేశారు.

తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న తండ్రి కొడుకులను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.