ఈ నెల 26న మొదలవ్వనున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి ఎందురు సిని ప్రముఖులు హాజరవుతారో చూడాలి.

ప్రత్యేకహోదా కోసం ఈ నెల 26న జరుగనున్న ఉద్యమానికి సినిమా స్టార్ల మద్దతు ఏ స్ధాయిలో ఉంటుందనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి సినీ ప్రపంచం మొత్తం మద్దతుగా నిలిచింది. లారెన్స్, ప్రభు లాంటి ప్రముఖులైతే ఏకంగా ఆందోళనల్లో కూడా పాలుపంచుకున్నారు. మరి, విశాఖపట్నం ఆర్కె బీచ్ లో 26 ఉదయం మొదలవ్వనున్న శాంతి ఉద్యమంలో ఎందరు స్టార్లు పాల్గొంటారనే విషయంపై చర్చ జరుగుతోంది.

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం సినీఫీల్డ్ లోని యువనటులు సాయిధరమ్, వరుణ్ తేజ, సంపూర్ణేష్ బాబు, శివాజీ, శివబాలాజీ, సందీప్ కిషన్, నిఖిల్, తనీష్, రఘుకుంచె లాంటి వారు మద్దతు ప్రకటించారు. సీనియర్లైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్తో పాటు జూనియర్ ఎన్ టిఆర్, ప్రభాస్, మహేష్ బాబు తదితరులు ఇంత వరకూ స్పందించలేదు. వీరేకాకుండా క్యరెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు అనేకమంది ఉన్నా వారి స్పందన ఏమిటో తెలీదు. ఇపుడు మద్దతు ప్రకటించిన వారు కూడా నేరుగా ఆర్కె బీచ్ కు వస్తారా లేక కేవలం మద్దతు మాత్రమే ఇచ్చి ఊరుకుంటారా అన్న విషయం కూడా తెలీదు.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా వుడ్లు ఏదైనా కానీండి సామాజిక అంశాలకు సంబంధించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏకమైతేనే వారికి విలువుంటుంది. ఎందుకంటే, సినిమాలు చూసేది ఫలానా కులం, ఫలానా మతం లేదా ఆ ప్రాంతంవారు మాత్రమేనని ఏమీ లేదుకదా? కాబట్టి ఈ నెల 26న మొదలవ్వనున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి ఎందురు సిని ప్రముఖులు హాజరవుతారో చూడాలి.