హైదరాబాద్: పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రిపబ్లిక్‌ టీవీ-సీ ఓటర్‌ సంస్థలు చేసిన సర్వే ఫలితాల నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి 19 లోకసభ స్థానాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి 6 సీట్లు వస్తాయని ఆ సర్వే తేల్చింది.

ఆ సర్వే ఫలితాల్లో జనసేన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మహేష్ కత్తి జనసేనపై వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. "నేషనల్ మీడియా సర్వేలలో కనిపించని జనసేన అంటూ మహేష్ కత్తి అంటూ అంటే పార్టీగా కూడా కన్సిడర్ చెయ్యడం లేదా లేక రాబోయే ఎన్నికల్లో కనీస ఉనికిని చాటుకోలేని పార్టీ అని వాళ్ళు డిసైడ్ అయ్యారా అని ఆయన ట్వీట్ చేశారు.

మహేష్ కత్తి పోస్ట్‌పై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, తీవ్ర మండిపడుతున్నారు. ఎన్నికలు జరిగి ఫలితాలొస్తే కదా.. ఎవరి సత్తా ఏమిటో తెలిసేది అంటూ మహేష్ కత్తిపై పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

 

సంబంధిత వార్త

తాజా సర్వే: జగన్ దే ఆధిపత్యం, చంద్రబాబుకు షాక్