‘జనసేన తరపున ప్రచారం చేస్తా’

First Published 2, Jun 2018, 10:03 AM IST
supreme hero saidhram tej wants to campaign for janasena
Highlights


మీడియాకి తెలిపిన సాయిధరమ్ తేజ్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చెప్తే తాను ఏదైనా చేస్తానని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ఆయన చెప్పాక చేయననే సందేహం అక్కర్లేదని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హీరోయిన్‌ కేథరిన్‌తో కలిసి శుక్రవారం ఇక్కడకు వచ్చారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశిస్తే జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమేనని తన ఉద్దేశాన్ని తెలియజేశారు. తాను నటించిన ‘తేజ్‌.. ఐ లవ్‌ యు’ సినిమా ఈ నెల 29న విడుదలవుతుందని, మరో సినిమా షూటింగ్‌ దశలో ఉందని సాయిధరమ్‌ చెప్పారు. గోదావరి తీరం రాజమహేంద్రవరం అంటే తనకు ఇష్టమని, ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ కేథరిన్‌ అన్నారు.

loader