Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె కేసు.. పురుషోత్తం, పద్మజల తరుపున వాదిస్తా: పీవీ కృష్ణమాచార్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతుల తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమాచార్య స్వచ్ఛందంగా ముందుకొచ్చారు

Supreme Court Lawyer P V Krishnamacharya Decided To Take Up Madanapalle Case
Author
Madanapalle, First Published Jan 30, 2021, 5:34 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతుల తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమాచార్య స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఇప్పటికే దిశ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కోర్టులో వాదిస్తున్నారు కృష్ణమాచార్య. పురుషోత్తంనాయుడు దగ్గర విద్యనభ్యసించిన పూర్వ విద్యార్ధుల అభ్యర్థనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసు గురించి వివరాలు సేకరించారు కృష్ణమాచార్య. 

మదనపల్లె అక్కాచెల్లెల ఆత్మహత్య కేసుల రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. పద్మజ .. తన పెద్ద కుమార్తె అలేఖ్యను చంపేసిన తర్వాత నాలుక కోసి తినేసిందంటూ పురుషోత్తం విచారణలో చెప్పాడంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది.

Also Read:మదనపల్లె కేసు: పద్మజ నాలుక తినలేదట, క్లారిటీ..

మదనపల్లె సబ్‌ జైలులో పురుషోత్తంను హైకోర్టు న్యాయవాది రజని కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడారు. మదనపల్లె జంటహత్యల ముద్దాయిలను ఎవరో ప్రేరేపించారని చెప్పారు. అలేఖ్య నాలుకను పద్మజ కోసి తినేసిందనే వార్తల్లో వాస్తవం‌ లేదన్నారు. శరీరంలో ఒక అవయవం తెగిపడినా ఆత్మవెనక్కి తిరిగి రాదని వారికి తెలుసన్నారు. 

వారిద్దరూ దేవుళ్లను నమ్మారు, క్షుద్ర పూజలను కాదని న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు తాను పురుషోత్తమ్‌ను కలిశాన్నారు. కాగా, కన్నకూతుళ్లనే దారుణంగా హత్య చేసిన కేసులో తల్లిదండ్రులిద్దరిపై కేసులు పెట్టి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios