మదనపల్లె అక్కాచెల్లెల ఆత్మహత్య కేసుల రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. పద్మజ .. తన పెద్ద కుమార్తె అలేఖ్యను చంపేసిన తర్వాత నాలుక కోసి తినేసిందంటూ పురుషోత్తం విచారణలో చెప్పాడంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది.

మదనపల్లె సబ్‌ జైలులో పురుషోత్తంను హైకోర్టు న్యాయవాది రజని కలిశారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడారు. మదనపల్లె జంటహత్యల ముద్దాయిలను ఎవరో ప్రేరేపించారని చెప్పారు. అలేఖ్య నాలుకను పద్మజ కోసి తినేసిందనే వార్తల్లో వాస్తవం‌ లేదన్నారు. శరీరంలో ఒక అవయవం తెగిపడినా ఆత్మవెనక్కి తిరిగి రాదని వారికి తెలుసన్నారు. 

వారిద్దరూ దేవుళ్లను నమ్మారు, క్షుద్ర పూజలను కాదని న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు తాను పురుషోత్తమ్‌ను కలిశాన్నారు. కాగా, కన్నకూతుళ్లనే దారుణంగా హత్య చేసిన కేసులో తల్లిదండ్రులిద్దరిపై కేసులు పెట్టి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.