చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్: కేసుల విచారణ తప్పదా ?

చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్: కేసుల విచారణ తప్పదా ?

సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్. ఇంతకీ ఏమిటా తీర్పంటారా? ఎటువంటి కేసైనా కానీ మ్యాగ్జిమమ్ 6 మాసాలకు మించి స్టే ఇచ్చేందుకు లేదన్నది తాజా తీర్పు. ఎందుకంటే, ప్రతీ కేసులోనూ స్టే ఇస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని కోట్లది కేసులు సంవత్సరాలతరబడి విచారణకు నోచుకోవటం లేదట. కాబట్టి ఏ కేసైనా సరే 6 నెలలకు మించి స్టే ఇచ్చేందుకు లేదని, 6 నెలలు కాగానే విచారణ తిరిగి మొదలుపెట్టాల్సిందేనంటూ స్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఒకవేళ 6 నెలలకన్నా మించి స్టే ఇవ్వాల్సి వస్తే న్యాయమూర్తి కారణాలను రాతమూలకంగా చెప్పాలట.

ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు మీద అనేక కేసులు సంవత్సరాలతరబడి స్టేల మీదనే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సుప్రింకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబు మీదున్న కేసులకు కూడా వర్తిస్తాయి. సంవత్సరాలతరబడి ఇప్పటికే స్టేలమీదున్న చంద్రబాబు కేసులు వెంటనే విచారణకు వస్తే చంద్రబాబు పరిస్దితేంటి? అందులోనూ సరిగ్గా ఎన్నికల హీట్ పెరుగుతున్న ఇటువంటి నేపధ్యంలో.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos