Asianet News TeluguAsianet News Telugu

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ ... నేడు సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరపనుంది. దీంతో సుప్రీం తీర్పు ఎలా వుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Supreme Court Inquiry on Chandrababu bail cancellation petition filed by AP CID AKP
Author
First Published Nov 28, 2023, 11:49 AM IST

న్యూడిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబుకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరుచేసింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. 

తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబుకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు అంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ చేసేందుకు హైకోర్టు తన పరిధిని దాటిందని అంటున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు తమ వాదన విని చంద్రబాబు బెయిల్ పై నిర్ణయం తీసేకోవాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరుతున్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో హైకోర్టుకు వివరించినట్లు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సైతం కోర్టు ముందుంచినట్లు తెలిపారు. కానీ ఇవేమీ పరిగణలోని తీసుకోకుండా ఏపీ హైకోర్టు ఏకపక్షంగా చంద్రబాబు బెయిల్ నిర్ణయం తీసుకుందని పొన్నవోలు ఆరోపించారు. చివరకు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా హైకోర్టు పాటించలేదని అన్నారు. అందువల్లే చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు వెళ్లినట్లు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

Read More  Nara Chandrababu naidu...లిక్కర్ కేసు: బాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్

ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ మాజీ సీఎం చంద్రబాబును సెప్టెంబర్ 9న సిఐడి అరెస్ట్ చేసింది. దీంతో దాదాపు 50 రోజులకు పైగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుండాల్సి వచ్చింది. చివరకు జైల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబుకు వైద్యం కోసం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీంతో చంద్రబాబు జైలునుండి విడుదలయ్యారు. 

ఇక ఈ స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇటీవల సాధారణ  బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. దీంతో ఇవాళ(నవంబర్ 20న) చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లాల్సివుండగా ఆ అవసరం లేకుండాపోయింది. 


  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios