రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆస్తుల విభజన జరగాలి: సుప్రీంలో ఏపీ డిమాండ్

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  ఆస్తుల  విషయం ఇంకా తేలలేదు. దీంతో  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.   ఈ విషయమై  నాలుగు వారాల గడువు ఇచ్చింది  ఉన్నత న్యాయస్థానం.
 

Supreme Court Gives Four Weeks Time To Centre and Telangana in Assets Case lns

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల  మధ్య  నెలకొన్న ఆస్తుల పంపకాల విషయంలో  కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానిక  సుప్రీంకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య   ఆస్తులు, అప్పుల పంపకం  ఇంకా  తేలలేదు.  దీంతో   ఈ ఏడాది జనవరి  09వ తేదీన  ఏపీ ప్రభుత్వం   సుప్రీంకోర్టులో పిటిషన్  దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై  తెలంగాణ,  కేంద్ర హోంశాఖకు  సుప్రీంకోర్టు గతంలోనే  నోటీసులు జారీ చేసింది.  

రెండు రాష్ట్రాల మధ్య  ఆస్తుల , అప్పుల  విషయమై  సుప్రీంకోర్టు  ఇవాళ  విచారణ నిర్వహించింది.రిటైర్డ్  జడ్జి  నేతృత్వంలో  ఆస్తులు, అప్పుల విభజన జరగాలని  ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది   వాదించారు.కేంద్రం, తెలంగాణ స్పందన  చూసిన తర్వాత  స్పందిస్తామన్న సుప్రీంకోర్టు తెలిపింది.   మరో వైపు  ఈ విషయమై  కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు  ఇచ్చింది. 

షెడ్యూల్ 9లోని సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ  రూ.24,018.53  ఉంటుందని  ఏపీ ప్రభుత్వం  చెబుతుంది.  ఇందులో  హైద్రాబాద్ లోనే  రూ. 22, 556.45 కోట్ల విలువైన  ఆస్తులున్నాయని  ఏపీ సర్కార్ వాదిస్తుంది.  షెడ్యూల్  10లో షెడ్యూల్-10లో పేర్కొన్న ఆస్తుల విలువ రూ.34,642.77 కోట్లు కాగా... అందులో రూ.30,530.86 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios