Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు.. రాష్ట్రపతికి సుప్రీం కొలీజియం సిఫార్సు

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుక్రవారం సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలను నియమించాలని సూచించింది

Supreme Court Collegium decides on appointment of new cjs for ap and ts high courts
Author
Amaravati, First Published Sep 17, 2021, 2:54 PM IST

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుక్రవారం సిఫార్సులను పంపింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలను నియమించాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెళ్లారు.

ఆమె స్థానంలో తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక సీజే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మను నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ చేసి ఆయన స్థానంలో ఛత్తీస్‌గఢ్‌ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం సూచించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios