శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాట్టును మంగళవారం నాడు కూడ సూర్య కిరణాలు తాకాయి. సోమవారం నాడు కూడ స్వామివారిని  సూర్యకిరణాలు తాకిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో స్వామి బంగారుఛాయలోకి మారి భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం నాడు  ఉదయం 6: 25 గంటల నుండి 6: 34 గంటల వరకు సూర్య కిరణాలు ఆదిత్యుని పాదాలను తాకాయి.  మంగళవారం నాడు కూడ సుమారు ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు  తాకాయి.

అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయంలో సూర్య కిరణాలు  రెండో రోజూ కూడ తాకాయి.  ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. రెండు రోజులుగా భక్తులు ఈ ఆలయాన్ని తండోపతండాలుగా సందర్శిస్తున్నారు.