చంద్రబాబుకు షాక్: కమలం గూటికి సుజనా చౌదరి?

Sujana Chowdary may switch over to BJP
Highlights

మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తారనే మాట వినిపిస్తోంది.

విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తారనే మాట వినిపిస్తోంది. ఆయన బిజెపిలోకి వెళ్లవచ్చునని తెలుగుదేశం పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నిారు. 

టీడీపిలో సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో పెద్ద దిక్కుగా కూడా ఉంటూ వచ్చారు. బిజెపి పెద్దలతో సుజనా చౌదరి సంబంధాలు నెరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎన్ సిబిఎన్ వాట్సప్ గ్రూపులో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓ మాట అన్నారు. ఈ గ్రూపులో మత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. తమకు అటువంటి సమాచారం ఏదీ లేదని, నిజమేమిటో బయటపడనీయండి అని లోకేష్ ఆ గ్రూపులో అన్నారు. సుజనా చౌదరిపై గ్రూపులో చర్చ సాగుతోందని చెప్పడానికి అది ఉదాహరణ. 

కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సుజనా వెంట వెళ్తారనే చర్చ కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో విరాళాల సేకరణలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులను టిడిపిలోకి తేవడంలో సుజనా కీలక పాత్ర పోషించారు. 

చంద్రబాబు విశ్వాసం పొందడం కారణంగా ఆయన కేంద్రంలో మంత్రి అయ్యారు కూడా. ఢిల్లీలో చంద్రబాబు తరఫున ప్రధాని మోడీని, ఇతర కేంద్ర మంత్రులను కలుస్తూ వ్యవహారాలు నడిపారు. అక్కడి సమాచారాన్ని చంద్రబాబుకు అందజేస్తూ వచ్చారు. 

నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయించడంలో విఫలమయ్యారనే కారణంతో సుజనా చౌదరితో కొంత మంది టీడీపి నాయకులు విభేదిస్తూ వచ్చారు. ఏడాదిన్నర పాటు చంద్రబాబుకు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సుజనా చౌదరితో దూరం మరింత పెరిగిందని అంటున్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడంలో సుజనా చౌదరి విఫలమయ్యారనే కారణంతో చంద్రబాబు యువ ఎంపీలు గల్లా జయదేవ్, కె రామ్మోహన్ నాయుడలను ప్రోత్సహించారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకోవడానికి కూడా సుజనా చౌదరి మనస్ఫూర్తిగా అంగీకరించలేదనే ప్రచారం ఉంది.

loader