Asianet News TeluguAsianet News Telugu

సుజనా....ప్యాకేజికి చట్టబద్దత ఏది?

ప్రత్యేకప్యాకేజికి 15 రోజుల్లో చట్టబద్దత వచ్చేస్తుందని జనవరి 30వ తేదీన సుజనా మీడియా ముఖంగా చెప్పారు.

Sujana chowdary  master of deadlines that never materialize

కేంద్రమంత్రి సుజనాచౌదరి ఏం సమాధానం చెబుతారు. అదేనండి ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత కల్పించే విషయంలో. ప్రత్యేకప్యాకేజికి 15 రోజుల్లో చట్టబద్దత వచ్చేస్తుందని జనవరి 30వ తేదీన సుజనా మీడియా ముఖంగా చెప్పారు. మరి చౌదరి చెప్పిన 15 రోజుల గడువైపోయి మరో 13 రోజులు కూడా అయిపోయింది. అలాగే,  జైట్లీ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి ఏడు మాసాలైపోయాయి. అయినా చట్టబద్దత విషయంలో కేంద్రం నుండి సానుకూలత రాలేదు. టేబుల్ ఐటెమ్ గా తెస్తే చివరి నిముషంలో వాయిదా పడిందని లీకులిచ్చి కేంద్రం తప్పించుకున్నది. మొన్నటి పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్యాకేజికి చట్టబద్దత విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ ఎంపిలకు, కేంద్రమంత్రులకు సూచించారు.

 

ఏపికి చట్టబద్దత కల్పించే అంశం నిజంగా క్యాబినెట్ దాకా వస్తే కేంద్రంపై ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఏమిటి? అంటే కేంద్రవైఖరిని ఇక్కడే అనుమానించాల్సి వస్తోంది. మాటల్లో మాత్రం చంద్రబాబు తమకు సహజమిత్రుడని, అదని, ఇదని మోడి దగ్గర నుండి ప్రతీ కేంద్రమంత్రీ చెబుతూనే ఉంటారు. కానీ అవసరం వచ్చినపుడు అందరూ మొహాలు చాటేస్తారు. అందుకే ప్రతీ చిన్న విషయానికీ చంద్రబాబు కేంద్రం చుట్టూ అన్నిసార్లు తిరగాల్సి వస్తోంది. ఒకపుడు కేంద్రంలో చక్రం తిప్పానని, మూడు సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టమని ఒత్తిడి కూడా పెట్టారని చంద్రబాబు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఏపికి చట్టబద్దత వచ్చేస్తుందని లీకులిచ్చుకుంటున్నారు. చూద్దాం ఆ ముచ్చట కూడా ఇంకెన్నిరోజులో.

 

ఇక, సుజనా అయితే చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పటంలో మహా దిట్ట.  ప్రత్యేకహోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు. హోదా వచ్చేస్తుందని మొన్నటి వరకూ ఎన్ని సార్లు చెప్పారో సుజనా మరచిపోయినా ప్రజలకు మాత్రం గుర్తే. హోదా అయిపోయింది..ప్యాకేజి మొదలైంది. రాసుకోండి 15 రోజుల్లో ఏపికి ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత వచ్చేస్తుందని చెప్పిన సుజనా అప్పటి నుండి ఎక్కడా కనబడటం లేదెందుకో.

Follow Us:
Download App:
  • android
  • ios