రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సుజనా చౌదరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి రావడంతో పార్టీ శ్రేణులు సుజనాకు ఘనస్వాగతం పలికాయి.

గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయనను విజయవాడ వరకు కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీగా తీసుకువచ్చారు. అనంతరం వెటర్నరీ కాలనీలోని వెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌లో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుజనా చౌదరి పాల్గొంటారు. 

"