టీటీడీ వివాదం.. ‘‘సుప్రీం కోర్టుకు వెళతా..’’

subramaniyan swamy and pawan kalyan reacts on ttd issue
Highlights

తెరపైకి సుబ్రమణియన్ స్వామి, పవన్ కళ్యాణ్

టీటీడీలో బోర్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించి..చివరకు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు మణ దీక్షితులు ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది. ధర్మానికి శాస్త్రాలకు విరుద్ధంగా టీటీడీ బోర్డు వ్యవహరిస్తున్నాదని, ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని, అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రధాన అర్చక పదవి నుండి తప్పించారని రమణ దీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ వివాదంలోకి అనూహ్యంగా బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు.

ఈ ఘటనపై సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రమణ దీక్షితులను తొలగించడంపై ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు.  ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం టీటీడీ విధానంపై స్పందించారు. టీటీడీ వివాదంపై ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆభరణాలు తరలిపోయినట్లుగా ఎప్పట్నుంచో అనుమానాలున్నాయన్నారు. ఆభరణాలు ఇజ్రాయెల్ తరలి వెళ్లినట్లుగా గతంలో తనకొక అధికారి చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. రమణ దీక్షితుల ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

loader