రఘురామకేసులో 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి: కేంద్ర హోంసెక్రటరీకి స్పీకర్ ఓం బిర్లా ఆదేశం
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో సహా ఇతర పోలీసు అధికారులపై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం శుక్రవారం నాడు స్పందించింది
న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో సహా ఇతర పోలీసు అధికారులపై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం శుక్రవారం నాడు స్పందించింది. ఈ విషయమై సమగ్ర వివరాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను ఆదేశించింది లోక్‌సభ సెక్రటేరియట్.
also read:సీఎం జగన్ కు రఘురామ తొమ్మిదో లేఖ... నాణ్యమైన మద్యాన్ని అందించాలంటూ
ఏపీ సీఎం జగన్, డీజీపీ సహా ఇతరులపై ఈ ఏడాది జూన్ రెండో తేదీన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని లోక్‌సభ స్పీకర్‌కు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.
ఇదే విషయమై టీడీపీకి చెందిన ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు కూడ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది.15 రోజుల్లో ఈ విషయమై సమగ్ర నివేదికను అందించాలని లోక్‌సభ సెక్రటేరియట్ హోం సెక్రటేరియట్ ను ఆదేశించింది.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఈ ఏడాది మే 14వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే నెపంతో ఏపీ సీఐడీ పోలీసులు రఘరామకృష్ణంరాజుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.