Asianet News TeluguAsianet News Telugu

పీజీ పరీక్షల్లో ... మాస్ కాపీయింగ్

పీజీ పరీక్షల్లో విద్యార్థులంతా మాస్ కాపీయింగ్ కి పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా ఎస్ కోట చైతన్య డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది.

students Mass copying in PG Exams at srungavarapukota
Author
Hyderabad, First Published Apr 25, 2019, 11:46 AM IST

పీజీ పరీక్షల్లో విద్యార్థులంతా మాస్ కాపీయింగ్ కి పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా ఎస్ కోట చైతన్య డిగ్రీ కళాశాలలో చోటుచేసుకుంది. ఎంఏ సోషల్ వర్క్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ కి పాల్పడ్డారు. మాస్ కాపీయింగ్ కి వీలుగా కాలేజీ యాజమాన్యం భారీగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

విద్యార్థులు.. పుస్తకాలు పెట్టుకొని మరీ పరీక్షలు రాయడం గమనార్హం. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా విద్యార్థులు మెటీరియల్ తీసుకుని మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న దృశ్యాలు కనపడ్డాయి. మీడియాను చూసి కొంత మంది విద్యార్థులు వారు తెచ్చుకున్న బుక్స్ ను కిటికిలో నుంచి బయటకు విసిరివేశారు. యాజమాన్యం అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజి మాస్ కాపీయింగ్ కు సహకరించినట్లు తెలుస్తోంది.

ఇక్కడ జరిగిన మాస్ కాపీయింగ్ కు పాల్పడిన విషయం ఆంధ్రా యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది. మాస్ కాపీయింగ్ కు పాల్పడినవారిపై, అందుకు సహకరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios