విద్యార్థులు క్రమశిక్షణ పాటించడం లేదని.. మోకాళ్లపై నిలబడి, తానే శిక్ష అనుభవించిన హెడ్ మాస్టర్..
ఓ స్కూల్ హెడ్ మాస్టర్ తన విద్యార్థుల ముందే మోకాళ్లపై నిలబడ్డారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, క్రమ శిక్షణ పాటించడం లేదని ఆ ప్రాధానోపాధ్యాయుడు తనకు తానుగా శిక్ష అనుభవించారు. ఈ విచిత్ర ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.

సాధారణంగా విద్యార్థులు క్రమశిక్షణగా ఉండకపోతే, చక్కగా చదవకపోతే ఉపాధ్యాయులు వారికి చిన్న చిన్న శిక్షలు విధిస్తారు. వారిని దారిలోకి తీసుకొస్తారు. భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి, జీవితంలో ఉన్నత స్థితికి రావాలంటే ఇలాంటి చిన్న శిక్షలు విధించకతప్పదు. అప్పుడే వారికి తప్పేంటో ? ఒప్పేంటో తెలుస్తుంది. ఇవి ప్రతీ పాఠశాలలో జరిగే మామూలు విషయమే. కానీ ఓ హెడ్ మాస్టర్ భిన్నంగా ఆలోచించారు. తప్పు చేసిన పిల్లలకు బదులు గాంధేయ మార్గంలో తానే శిక్ష అనుభవించాడు. విద్యార్థుల ఎదుటే మోకాళ్లపై నిలబడ్డాడు.
చంద్రబాబు బాగానే ఉన్నారు.. ఆందోళన చెందవద్దు - భువనేశ్వరికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్..
అసలేం జరిగిందంటే.. అది చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎస్‌ఆర్‌కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాల. ఆ పాఠశాలలో మనోహర్‌నాయుడు హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆ పాఠశాలకు వచ్చిన మొదట్లోనే క్రమశిక్షణగా ఉండాలని పిల్లలకు సూచించారు. సమయానికి బడికి రావాలని, యూనిఫాం ధరించాలని చెప్పారు. అలా చేయకపోతే ఎవరికీ శిక్ష విధించబోనని, తానే శిక్ష విధించుకుంటానని స్పష్టం చేశారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగమే అని అంగీకరించిన యూఏఈ.. పాకిస్థాన్ కు సందేశం..
అయితే పలువురు విద్యార్థులు గురువారం పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. మరి కొందరు యూనిఫాం ధరించకుండానే, మామూలు దుస్తులో బడికి చేరుకున్నారు. దీనిని హెడ్ మాస్టర్ మనోహర్ నాయుడు గమనించారు. పిల్లలు క్రమశిక్షణ తప్పడం చూసి కలత చెందారు. గతంలో చెప్పినట్టుగా తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థుల ఎదుటే మోకాళ్లపై నిలబడి శిక్ష అనుభవించారు.