Asianet News TeluguAsianet News Telugu

నేడు రామతీర్థంలో రాముడి విగ్రహం తొలగింపు..

ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని నేడు దేవాదాయ శాఖాధికారులు తొలగించనున్నారు. రాముడి విగ్రహంతో పాటు సీత, లక్ష్మణుల విగ్రహాలను సైతం అధికారులు తొలగించనున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 

statues of rama and sitha in ramatheertham are removing today - bsb
Author
Hyderabad, First Published Jan 18, 2021, 9:32 AM IST

ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని నేడు దేవాదాయ శాఖాధికారులు తొలగించనున్నారు. రాముడి విగ్రహంతో పాటు సీత, లక్ష్మణుల విగ్రహాలను సైతం అధికారులు తొలగించనున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 

రామతీర్థం పుణ్యక్షేత్రంలో నీలాచలంపై ఉన్న కోదండరాముడి దేవాలయంలో ఖండిత విగ్రహాల తొలగింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఇటీవల కోదండరాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన నేపత్యంలో పున:ప్రతిష్టాపనకు చర్యలు చేపడుతున్నారు. 

ఈ పురాతన ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఉన్నచోట ప్రాయశ్చిత్త హోమాల నిర్వహణకు ద్వారక తిరుమ నుంచి ఆగమ పాఠశాల ప్రధానాచార్యులు వంశీకృష్ణతో పాటు వేదపండితులు వస్తున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించాక విగ్రహాలను స్థాన భ్రంశం చేస్తారు.

అనంతరం వీటిని మరోచోట భద్రపరుస్తారు. తరువాత బాలాలయం నిర్మాణానికి వేద పండితులతో మంచి ముహూర్తం నిర్ణయించేందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెప్పారు. నీలాచలం కొండపై కోదండరాముని ఆలయంలో హోమాలు నిర్వహించేందుకు ముందస్తు అనుమతులకు ఎస్పీకి ఇప్పటికే పిటిషన్ పెట్టుకున్నట్లు ఇన్ ఛార్జి ఈవో రంగారావు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios