Asianet News TeluguAsianet News Telugu

ఇది...40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం

  • ఖజానా ఖాళీ అయిపోతోంది. దాదాపు అన్నీ చెల్లింపులను నిలిపేయాలని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేసారు.
  • గతంలో ఎన్నడూ లేని స్ధాయిలో ఖజానా పూర్తిస్ధాయిలో దెబ్బతినేసింది.
  • జీతాలు తప్ప ఇతరత్రా ఏ విధమైన చెల్లింపులు చేసేందుకు లేదంటూ శనివారం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. 
  •  
State exchequer in bad condition

ఖజానా ఖాళీ అయిపోతోంది. దాదాపు అన్నీ చెల్లింపులను నిలిపేయాలని చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేసారు. గతంలో ఎన్నడూ లేని స్ధాయిలో ఖజానా పూర్తిస్ధాయిలో దెబ్బతినేసింది. జీతాలు తప్ప ఇతరత్రా ఏ విధమైన చెల్లింపులు చేసేందుకు లేదంటూ శనివారం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.  ప్రభుత్వ ఖజనా ఏ పరిస్ధితిలో ఉందో తెలియజేయటంతో పాటు చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఏంటో  తాజా ఆదేశాలే తెలియజేస్తోంది.

విభజనతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని తనలాంటి అనుభవజ్ఞుడైతేనే బాగు చేయగలడంటూ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా ఊదరగొట్టిందీ అందరికీ గుర్తుండే ఉంటుంది. విభజనపుడు రాష్ట్రం అప్పులు సుమారు రూ. 90 వేల కోట్లైతే ప్రస్తుతం రూ 2.18 లక్షల కోట్లకు చేరుకుంది. విద్యార్ధుల స్కాలర్ షిప్పులు, ఫించన్లు బిల్లుల మంజూరులో కూడా జాప్యమే. ప్రతీ నెల 15-30వ తేదీలోగా ప్రత్యేక అనుమతులుంటే కానీ ఏ బిల్లూ చెల్లించవద్దని చంద్రబాబు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసారంటేనే రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమవుతోంది.

ఎన్ని బిల్లులు ఆపినా, ఉద్యోగులకు జీతాలైతే ఇవ్వక తప్పదు కదా? అదేవిధంగా సిఎం, మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధుల జీతబత్యాలు కూడా చెల్లించాల్సిందే. అందుకనే వాటకి మాత్రం ఎటువంటి లోటు లేకుండా మిగిలిన బిల్లులన్నింటినీ పెండింగిలో పెట్టేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. తాజా ప్రభుత్వ ఆదేశాలతో సంక్షేమ పథకాల అమలుకే ముందు ఎసరొచ్చేది. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే రూ. 150 కోట్ల ఫించన్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే మిగిలిన జిల్లాల పరిస్ధితేంటో ఎవరికి వారుగా అంచనా వేసుకోవాల్సిందే. మరి, ప్రతిష్టకు పోయి వ్యక్తిగత ఇమేజి పెంచుకునేందుకు చేస్తున్న ఖర్చులు అన్నీ తడిసి మోపెడై చివరకు ఖజానాను కుదేలు చేసాయి. అది మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం.

 

Follow Us:
Download App:
  • android
  • ios