విజయవాడ: రంజాన్ పవిత్రమాసం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌లో టీడీపీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 

ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయయారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు రాష్ట్రం, దేశం బాగుండాలని ఇప్తార్ దువా చేశారు చంద్రబాబు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేశారు. 

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లతోపాటు మాజీమంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, దేవినేని అవినాష్, నాగూల్ మీరాలు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.