Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఇంటి వద్ద తొక్కిసలాట : స్పృహ తప్పిన మహిళ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద తొక్కిసలాట  జరిగింది.  జగన్ కి  ఫిర్యాదులు అందజేయడానికి జనాలు కుప్పలు తెప్పలుగా రావడంతో తొక్కిసలాట జరిగింది.

stampede at CM Jagan house, one hospitalized
Author
Hyderabad, First Published Jul 1, 2019, 11:48 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద తొక్కిసలాట  జరిగింది.  జగన్ కి  ఫిర్యాదులు అందజేయడానికి జనాలు కుప్పలు తెప్పలుగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ  ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన మహిళ విశ్రాంతమ్మ స్పృహ తప్పిపడిపోయింది. ముఖ్యమంత్రికి తన సమస్య వివరిద్దామని వచ్చి.. ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.

 సీఎం ఫిర్యాదులు తీసుకుంటారనే ప్రచారం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రజలు పెద్దసంఖ్యలో రావడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిని కలవాలంటూ ఒక్కసారిగా ప్రజలు లోపలికి రావడంతో తోపులాట జరిగింది.
 
కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేటి నుంచి నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్‌ ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా పడింది.అయితే ఆ విషయం తెలియని ప్రజలు సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చివరికి విషయం తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు.ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వినతులు స్వీకరించి సత్వర పరిష్కారానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ప్రజాదర్బార్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించాలనుకున్నారు. 

ఈ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మొదలు పెట్టాలని ఆయన భావించారు. అయితే ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడం, జూలైలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసినట్లు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios