ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబు అరెస్టుకు రంగం  సిద్ధమైంది. కర్నూలు జిల్లాలోని కెఇ నియోజకవర్గంలో పత్తికొండ వైసిపి సమన్వయకర్త చెఱుకులపాటు నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు అరెస్టు తప్పదని తేలిపోయింది. పోయిన నెలలలోనే శ్యాంబాబు అరెస్టుకు హైకోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తన అరెస్టుపై స్టే తెచ్చుకునేందుకు శ్యాంబాబు చాలా ప్రయత్నాలే చేశారు. కేసును విచారించిన కోర్టు బుధవారం అరెస్టుపై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. దాంతో స్టే ఆఫ్ అరెస్టు సౌకర్యం శ్యాంబాబుకు దొరకలేదు. కాబట్టి గురువారం కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయి. వెంటనే కోర్టు ద్వారా శ్యాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి. నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు హస్తముందని నారాయణరెడ్డి భార్య శ్రీదేవీరెడ్డి న్యాయపోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.