శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు.

శ్రీశైలం: Kurnool జిల్లా Srisailam లో వైభవంగా Maha Shivaratri Brahmotsavams ప్రారంభమయ్యాయి. స్వామివారి యాగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు, EO లవన్న దంపతులు మంగళవారం నాడు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ధ్వజపటం ఆవిష్కరణ చేయనున్నారు. రేపటి నుంచి స్వామి అమ్మవారికి వివిధ వాహన సేవలు శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని సర్వ దర్శనం, ఆర్జిత సేవలను అనుమతించడం లేదని ఈవో Lavanna ప్రకటించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవాన్ని మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. Corona ప్రోటోకాల్ దృష్ట్యా భౌతిక దూరం పాటించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు స్క్రీనింగ్ చేసేందుకు సిబ్బందిని నియమించారు. మరో వైపు మాస్కులు లేకుండా భక్తులు ఆలయంలోకి అనుమతించడం లేదు.

ప్రతి ఏటా సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మాఘ మాసం 29వ రోజున ఈ ఉత్సవాలను నిర్వహిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి లింగోద్బవకాల సమయంలో అభిషేకం నిర్వహిస్తారు. పాగలంకరణ అనేది శ్రీశైలం ఆలయంలో మాత్రమే అనుసరించే ప్రత్యేకమైన ఆచారం. ఇది పండుగలలో అత్యంత ముఖ్యమైందిగా ఈవో తెలిపారు.

ఇండియాలో 12 జ్యోతిర్లంగ కేంద్రాలున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని సోమనాధ్ ఆలయం జ్యోతిర్లంగంగా పేరొందింది. ఈ ఆలయంలో విదేశీయుల దాడిలో 16 దఫాలు ధ్వంసమైన తర్వాత పునర్నిర్మించారు.

కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం దేవాలయం కూడా జ్యోతిర్లంగంగా పేరొందింది. ఆదిశంకరాచార్యులు శివానందలాహిరిని రచించిన దివ్యక్షేత్రంగా పిలుస్తారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని, మంధాత శివపురి ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయం,ఉత్తరాఖండ్ లోని కేధారేశ్వర ఆలయం పుణెలోని భీమశంకర్ ఆలయం కూడా జ్యోతిర్లంగంగా పిలుస్తారు.

వారణాసిలో కాశీ విశ్వనాధుడి ఆలయం, నాసిక్ లో త్రయంభకేశ్వర్, జార్ఖండ్ లోని వైద్యనాథ్ ఆలయం, గుజరాత్ లోని నాగేశ్వర ఆలయం, రామేశ్వరంలోని రామనాథ్ ఆలయం, ఔరంగబాద్ లోని గ్రిహిష్‌నేశ్వర్ ఆలయాలను కూడా జ్యోతిర్లంగ ఆలయాలుగా పిలుస్తారు.