కర్నూల్: ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తుండడంతో  శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. మరో మూడు రోజుల పాటు భారీగా సుమారు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గత నెల 30వ తేదీ నుండి ఇప్పటివరకు 360 టీఎంసీల నీరు వచ్చింది. 

సగటున రోజుకు 30 టీఎంసీల నీరు వచ్చి చేరింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుండి ప్రతి రోజూ 6 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర నుండి 2 లక్షలకు పైగా  నీరు వస్తోంది. రానున్న మూడు రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం  300 టీఎంసీల నీరు వచ్చే మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

సగటున రోజుకు కనీసం 100 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తతుం జూరాల నుండి 10,71,220 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. శ్రీశైలం నుండి 10, 40, 122 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. 


సంబంధిత వార్తలు

నాగార్జున‌సాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుడు గల్లంతు

సాగర్ గేట్ల ఎత్తివేత, దిగువకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ (వీడియో)