నాగార్జునసాగర్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద  సోమవారం నాడు విషాదం చోటు చేసుకొంది. డ్యామ్ కింది భాగంలో వరద నీటిలో ఓ పర్యాటకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

గల్లంతైన వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎగువ నుండి భారీగా  వరద నీరు వచ్చి చేరుతున్నందున సాగర్ గేట్లు ఎత్తారు. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  అయితే డ్యామ్ దిగువ బాగంలో ఉన్న పర్యాటకుడు నీటి ఉదృతిని అంచనావేయలేక కొట్టుకుపోయాడు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి 8.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టుకు రెండు మూడు రోజుల వరకు ఇదే ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
 

   "