లోన్ యాప్ వేధింపులు: ధవళేశ్వరంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

Srinivas  allegedly ends life over harrasment by loan app agents in East Godavari


రాజమండ్రి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడితండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నాడు. ధవళేశ్వరంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో శ్రీనివాస్ షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.  శ్రీనివాస్  లోన్ యాప్ సంస్థ నుండి రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని శ్రీనివాస్ చెల్లించాడు. అయితే  రుణం చెల్లించినా  కూడ వేధింపులు ఆగలేదు. దీంతో శ్రీనివాస్  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

శ్రీనివాస్ ది నల్లజెర్ల మండలం దూబచర్ల గ్రామంగా పోలీసులు తెలిపారు. లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్యలు చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు. గతంలో  కూడ లోన్ యాప్ ల వేధింపుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యలకు పాల్నడ్డారు. 

గత నెల 8 వ తేదీన రాజమండ్రిలో  దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గా ప్రసాద్, రమ్యలక్ష్మి అనే దంపతులు  లోన్ యాప్ నుండి  రుణం తీసుకున్నారు.ఈరుణం సకాలంలో చెల్లించలేదు.దీంతో  లోన్ నిర్వాహకులు వేధింపులకు దిగారు.   ఈ వేధింపులు భరించలేక రాజమండ్రి పట్టణంలోని లాడ్జీకి వెళ్లి దంపతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన పల్నాడుజిల్లాలోని నారాయణపురం గ్రామంలో శివ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్  యాప్ లో శివ రూ. 8 వేలు రుణం తీసుకున్నాడు. లోన్ యా ప్ లకు రూ. 20 వేలు చెల్లించాడు. అయినా కూడా వేధింపులు ఆగలేదు. దీంతో శివ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది జూలై 4వ తేదీన సతీష్ అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.లోన్ యాప్ ల నుండి రుణం తీసుకున్న సతీష్ కు వేధింపులు ఎక్కువ కావడంతో ఆతను ఆత్మహత్యచేసుకున్నాడు. 

ఈ ఏడాది సెప్టెంబర్ 26న హైద్రాబాద్ నిజాంపేటకు చెందిన రాజేష్ అనే వ్యక్తి లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 24వ తేదీన కరీంనగర్ కు చెందిన మునిసాయి అనే యువకుడు లోన్ యాప్ నుండి రూ. 10 వేలు రుణంగా తీసుకున్నాడు. లోన్ యాప్ లకు రూ. 45 వేలు మునిసాయి చెల్లించాడు. అయినా కూడా వేధింపులకు పాల్పడడంతో లోన్ యాప్ నిర్వాహకులు మునిసాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

also read:లోన్ యాప్ ఏజంట్ల వేధింపులు: హైద్రాబాద్ లో రాజేష్ సూసైడ్

లోన్ యాప్ వేధింపులు భరించలేక ఈ ఏడాది జూలై 12న  కృష్ణాజిల్లాలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. . తీసుకున్న రూ. 20వేల లోన్ కు ఆమె రూ. 2 లక్షలు చెల్లించింది. అయినా కూడా వేధించారు. నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios