ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: సీఐడీ విచారణకు హాజరైన శ్రీకాంత్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో   రెండు  రోజుల క్రితం నోటీసులు అందుకున్న  అర్జా శ్రీకాంత్  ఇవాళ  సీఐడీ విచారణకు హాజరయ్యారు.  

Srinath  Attends before  CID  Probe  in AP Skill Development Case

హైదరాబాద్:  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ లో  సీఐడీ  విచారణకు   అర్జా శ్రీకాంత్  గురువారం నాడు  హజరయ్యారు. చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్న సమయంలో  ఏపీ‌ఎస్‌డీసీ ఎండీగా వ్యహరించిన శ్రీకాంత్ కు  సీఐడీ అధికారులు  రెండు  రోజుల క్రితం  నోటీసులు  జారీ చేశారు. సీఐడీ నోటీసుల మేరకు  ఇవాళ  విచారణకు  శ్రీకాంత్  హజరయ్యారు. 

యువతకు పలు అంశాల్లో  శిక్షణ ఇచ్చేందుకు గాను  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  పనిచేసింది. శిక్షణ పూర్తైన  తర్వాత  యువతకు ఉపాధి కల్పించడమే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  ఉద్దేశం. సీమెన్స్, డిజైన్  టెక్  సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పదం  చేసుకున్నాయి. 

అయితే  ఈ  స్కీంలో  అవకతవకలు జరిగాయని  భావించిన జగన్  సర్కార్  ఏపీ సీఐడీకి విచారణను అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది..దీంతో ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.  గతంలో  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  సంస్థకు ఎండీగా  పనిచేసిన శ్రీకాంత్ కు  రెండు  రోజుల క్రితం  సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ నోటీసులు అందుకున్న శ్రీకాంత్  ఇవాళ విచారణకు  హాజరయ్యారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసులో  షెల్ కంపెనీలను సీఐడీ అధికారులు గుర్తించారు.  అంతేకాదు ఈ విషయంలో  మనీలాండరింగ్  చోటుచేసుకుందనే  అనుమానం తో  విచారణ చేయాలని  ఈడీకి  సీఐడీ అధికారులు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా  ఈడీ అధికారులు కూడా  రంగంలోకి దిగారు.  2022 డిసెంబర్ మాసరంలో  ఈడీ అధికారులు  నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

also read:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్: 26 మందికి నోటీసులు, రేపటి నుండి విచారణ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  పై  2021 డిసెంబర్  10న  సీఐడీ  కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయమై స్కిల్ డెవలప్ మెంట్  లో  కీలకంగా వ్యవహరించిన  గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా  26 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios