Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్: 26 మందికి నోటీసులు, రేపటి నుండి విచారణ


ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్  మెంట్  కార్పోరేషన్  స్కాంపై ఈడీ కేంద్రీకరించింది.  26 మందికి నోటీసులు పంపింది.  రేపు విచారణకు రావాలని ఈడీ  ఆదేశాలు జారీ చేసింది. 

Enforcement Directorate  Issues Notices To  26 members in AP Skill Development  Corporation Scam
Author
First Published Dec 4, 2022, 12:35 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్  స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాంపై  ఈడీ అధికారులు ఫోకస్  పెట్టారు. ఈ  స్కాంపై  ఈడీ అధికారులు  26 మందికి నోటీసులు పంపింది. రేపు విచారణకు రావాలని  ఈడీ కోరింది.   హైద్రాబాద్ లోని  తమ కార్యాలయంలో జరిగే విచారణకు రేపు రావాలని ఈడీ ఆ నోటీసుల్లో పేర్కొంది.  పలు షెల్  కంపెనీలను ఏర్పాటు చేసి రూ. 234  కోట్లను  దారి మళ్లించారని  ఈడీ అనుమానిస్తుంది.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్  మాజీ చైర్మెన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్  లక్ష్మీనారాయణ సహా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.  

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో  యువతకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను  ఏపీ స్కిల్ డెవలప్  మెంట్  పనిచేసింది.  యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలను సృష్టించడమే ఈ  కార్పోరేషన్ ఉద్దేశ్యం.గుజరాత్ రాష్ట్రంలో  సీమెన్స్  సంస్థ  ఇదే తరహలో  కార్యక్రమాలను నిర్వహించింది. దీంతో  చంద్రబాబు సర్కార్   ఈ  పథకాన్ని అమలు చేసింది.  సీమెన్స్, డిజైన్  టెక్  సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పదం  చేసుకున్నాయి. 

సెంటర్ ఆఫ్  ఎక్స్ లెన్స్  సంస్థతో పాటు  దానికి కింద టెక్నికల్  స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను నెలకొల్పారు.   అయితే  ఈ  స్కీంలో  అవకతవకలు జరిగాయని  భావించిన జగన్  సర్కార్  ఏపీ సీఐడీకి విచారణను అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఏపీ సీఐడీ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.  ఈ విషయమై మనీలాండరింగ్  చోటు చేసుకుందనే అనుమానంతో  సీఐడీ అధికారులు ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 

స్కిల్ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఆడిట్ లో  అవకతవకలు జరిగినట్టు తేలడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్  కార్పోరేషన్ లో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం  కుదుర్చుకున్న సీమెన్స్  సంస్థ  రూ. 370 కోట్ల బిల్లులు తీసుకొని  బిల్లులను ఎగ్గొట్టినట్టుగా  అధికారులు గుర్తించారు.

also read:AP Skill development Corporation scamలో సీఐడీ దూకుడు: పుణెలో ముగ్గురి అరెస్ట్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కార్పోరేషన్  స్కాంకు సంబంధించి సీఐడీ  అధికారులు గతంలో పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా  26 మందిపై ఏపీ సీఐడీ అధికారులు  2021 డిసెంబర్  10న కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగానే విచారణ నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios