బిజెపితో తెలుగుదేశం రహస్య మంతనాలు

Srikanth Reddy says TDP is in touch with BJP regularly
Highlights

బిజెపితో తెలుగుదేశం రహస్య మంతనాలు

డప: తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బిజెపితో మంతనాలు సాగిస్తోందా అని అంటే అవునని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఇంకా బిజెపితో రహస్య చర్చలు చేస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

రాష్ట్రంలో టిడీపి, బిజెపిలు కలిసి డ్రామా పాలన సాగిస్తున్నాయని అన్నారు. తాము బిజెపిపై పోరాటం చేస్తున్నామని ఓ వైపు డైలాగులు కొడుతూ, మరో వైపు తమపై కేసులు పెడతారనే భయంతో లాలూచీ బేరాలు సాగిస్తున్నారని విమర్శించారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కాంగ్రెసుతో కలిసి ఏడు పార్టీలు అభిశంసన తీర్మానానికి నోటీసు ఇస్తే బిజెపితో పోరాడుతున్నామని చెప్పే టిడీపీ నోటీసుకు ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని అడిగారు. 

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో బిజెపికి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు ఎందుకు స్థానం కల్పించారని ప్రశ్నించారు. మరోవైపు బిజెపికి చెందిన కేంద్ర మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ను ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి, టీడీపిలు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 

తమ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో కలిస్తే బిజెపితో వైసిపి కుమ్మక్కయిందని విమర్శలు చేశారని ఆయన గుర్తు చేశారు. బిజెపితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ టీడీపి తమ పార్టీపై ఎదురుదాడి చేయడం ఎంత వరకు సమంజసమని అడిగారు. 

loader