శ్రీకాళహస్తి: హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై ఏపీలో జరుగుతున్న వరుస దాడులను ఖండించాల్సింది పోయి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న కొడాలి నాని అనుచితంగా మాట్లాడటం దారుణమని శ్రీకాళహస్తి ఆలయ మాజీ ఛైర్మన్, బిజెపి నాయకులు కోలా ఆనంద్ అన్నారు. ఇలా మరోసారి హిందూ మతం, ఆలయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాని నాలుక చీరేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా వుంటాయన్నారు. 

గడ్డాలు, జుట్టు పెంచుకుని ఏడాదికోసారి తిరుమల వెళ్ళే మంత్రి నాని అదే తిరుమల ఆచారాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. మంత్రి పదవి కోసమే ఆయన శిలువను వేసుకుని దొంగాటలు ఆడుతున్నాడని ఆనంద్ మండిపడ్డారు. 

read more   హిందూ దేవాలయాలపై ఆగని దాడులు...ఈసారి కాలభైరవ విగ్రహం ధ్వంసం

ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వచ్చే సీఎం జగన్ తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు. వైసిపి ప్రభుత్వ హిందూ వ్యతిరేక విదానాల వల్ల రాష్ట్రంలోని హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ల గురించి మంత్రి నాని లాగ అనుచితంగా మాట్లాడటాన్ని హిందూ సమాజం సహించలేకపోతోందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అరాచకం రాజ్యమేలుతోందని ఆనంద్ ఆరోపించారు.