ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి రిమాండ్‌లో వున్న టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అన్ని కేసుల నుంచి బయటకు వస్తారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరు అయ్యింది.

తెలుగుదేశం పార్టీ , కింజారపు అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయ జీవితంలో మ‌చ్చ‌లేని అచ్చెంనాయుడు రాజ‌కీయ వేధింపుల‌తో పెట్టిన కేసుల నుంచి మీ అంద‌రి ఆశీస్సుల‌తో  బ‌య‌ట‌కొస్తారు.

Also Read:ఈఎస్ఐ స్కాం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి బెయిల్ మంజూరు

బెయిల్ వ‌చ్చినా బాబాయ్ క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ద‌య‌చేసి ఎవ్వ‌రూ ప‌రామ‌ర్శ‌ల‌కు రావొద్దు. మీ అభిమాన‌మే మాకు కొండంత అండ‌. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్ర‌తీ ఒక్క‌రికీ కింజారపు కుటుంబం త‌ర‌ఫున పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

ఈ క‌ష్ట‌కాలంలో మా కుటుంబానికి అండ‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌లంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు..