Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కాం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Ap High court grants bail to atchannaidu
Author
Amaravathi, First Published Aug 28, 2020, 12:27 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 70 రోజులుగా అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్నారు. నామినేషన్ పద్దతిలోనే మందుల కొనుగోలుకు అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చారని... దీని ద్వారా రూ. 150 కోట్ల అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు.

also readపితాని తనయుడు సురేష్‌కు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

ఈ కేసులో అరెస్టైన ఓ వ్యక్తికి ఇటీవలనే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు అచ్చెన్నాయుడికి ఇవాళ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ ఏడాది జూన్ 12 వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

 ఆరోగ్య కారణాలతో  గుంటూరు జైల్లో ఉన్న అచ్చెన్నాయుడిని పోలీసులు రమేష్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడికి కరోనా సోకడంతో కోర్టు అనుమతితో ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios