శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన కోడిగుడ్డు ధర

sravana masam effect on egg prices
Highlights

చాలా మంది శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి, మాంసం, కోడిగుడ్డు లాంటివాటికి దూరంగా ఉంటారు. దీంతో కోడిగుడ్డు వినియోగంపై ఈ మాసం ప్రభావం బాగానే పడింది.

శ్రావణమాసం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అప్పుడే ఈ మాసం ఎఫెక్ట్ కోడిగుడ్డుపై పడింది. మన దగ్గర శ్రావణమాసం ప్రారంభం కావడానికి ఇంకో నాలుగు, ఐదు రోజులు ఉంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యింది కూడా. చాలా మంది శ్రావణమాసంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి, మాంసం, కోడిగుడ్డు లాంటివాటికి దూరంగా ఉంటారు. దీంతో కోడిగుడ్డు వినియోగంపై ఈ మాసం ప్రభావం బాగానే పడింది.

అంతేగాక లారీల సమ్మె, అసోం,  పశ్చిమ బంగ ప్రాంతాల్లో వరదల ప్రభావంతో ఆయా ప్రాంతాలకు గుడ్లు ఎగుమతులు భారీగా తగ్గాయి. ఆ ప్రభావం ధరపై చూపటంతో వారం రోజుల వ్యవధిలోనే ఒక్కో గుడ్డుపై 80పైసలు మేర తగ్గిపోవడంతో ఫౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


ఈశాన్య రాష్ట్రాలైన ఒడిశా, అసోం, పశ్చిమ బంగ, బిహార్‌ ప్రాంతాలకు గత ఏడాది జూన్‌, జులై నెలల్లో 140 లారీల సరకు ఎగుమతికాగా ఈ ఏడాది ఆయా నెలల్లో సగటున 100 నుంచి 105 లారీల సరకునే ఎగుమతి చేశారు. మన ప్రాంతం కంటే 15రోజులు ముందుగానే అక్కడ శ్రావణ మాసం ఆరంభమవుతుంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో శ్రావణ మాసం కావడంతో వినియోగం భారీగా తగ్గింది. 4 రోజలుగా పరిశీలిస్తే 85 నుంచి 90 లారీలకు మించి గుడ్లు ఎగుమతి కావడం లేదని ఫౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

loader