Asianet News TeluguAsianet News Telugu

జగన్‌ను కలిసిన ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డి, పారా సైక్లిస్ట్ అర్షద్

అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా సైక్లిస్ట్, ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఇదే సమయంలో క్రీడాకారులు వారు సాధించిన పతకాలను ముఖ్యమంత్రి జగన్‌కి చూపించారు

sports persons meet ap cm ys jagan
Author
First Published Aug 30, 2022, 9:57 PM IST

అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా సైక్లిస్ట్, ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఇవాళ ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి, ఆశీస్సులు అందించారు. అనంతరం వారు సాధించిన విజయాలు, పతకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో క్రీడాకారులు వారు సాధించిన పతకాలను ముఖ్యమంత్రి జగన్‌కి చూపించారు. బేబి రెడ్డి ఇటీవల జరిగిన కామన్వెల్త్ దేశాల ఫెన్సింగ్ చాంపియన్ షిప్ జూనియర్స్ టీమ్ విభాగంలో కాంస్యం సాధించారు. షేక్ అర్షద్ ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ లో రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు.

ఇకపోతే.. ఇటీవల బ్రిటన్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన తెలుగు క్రీడాకారిణీలు షట్లర్ పీవీ సింధు, భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలు ఈ.రజనీలు గత గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను గెలిచిన బంగారు పతకాన్ని సీఎంకు చూపించారు పీవీ సింధు. అలాగే కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో గోల్‌కీపర్‌గా వ్యవహరించిన ఇ.రజని.. కాంస్య పతకం సాధించిన ఉమెన్స్‌ హాకీ టీమ్ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్‌ టీ షర్ట్‌ను సీఎంకు బహుకరించారు రజనీ. అనంతరం రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అంతకుముందు కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్న పీవీ సింధు, రజీనీలు ఇటీవల ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇంట్లో భోజనానికి వెళ్లిన సంగతి తెలిసిందే.  కాగా.. కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో కెనడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో ఘన విజయం అందుకుంది పీవీ సింధు. ఇంతకుముందు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌ బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడి రజతం సాధించిన పీవీ సింధు, ఈసారి ఏకంగా స్వర్ణం సాధించి... ‘ఇండియన్ గోల్డెన్ గర్ల్’గా కీర్తి ఘడించింది... 

 

Follow Us:
Download App:
  • android
  • ios