మైక్రో ఫైనాన్స్ యాప్స్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి: డీజీపీ గౌతం సవాంగ్

ఏపీలో మైక్రో ఫైనాన్స్ యాప్స్  ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.

special drive on micro finance apps says AP DGP goutham sawang lns

అమరావతి: ఏపీలో మైక్రో ఫైనాన్స్ యాప్స్  ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  మొబైల్ లోన్ యాప్  సంస్థలు మహిలను టార్గెట్ చేస్తున్నాయని ఆయన చెప్పారు.మొబైల్ లోన్ యాప్ లపై ఏపీలో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టామన్నారు. బాధితులు ఎవరైనా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. 

నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్ నుండి యాప్ లను నిర్వహిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఇన్‌స్టంట్ లోన్లు ఇస్తూ  రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేసిన ఘటనలు ఏపీ,తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకొన్నారు. మరికొందరు ఈ వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదులపై రెండు రాష్ట్రాల్లోని పోలీసులు  ఈ యాప్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. విజయవాడలో కూడ మొబైల్ యాప్ సంస్థలపై ఇవాళ కూడ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios