అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్: కోడెల

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 15, Aug 2018, 11:00 AM IST
Speaker Kodela shivaprasada rao hosts national flag at Ap assembly
Highlights

 రాష్ట్రంలో అనేక సమస్యలున్నా  సంక్షేమం, అభివృద్ధిలో  ముందుకు సాగుతున్నామని ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుండి సహకారం లేదనేదే తమ బాధ అన్నారు.

అమరావతి: రాష్ట్రంలో అనేక సమస్యలున్నా  సంక్షేమం, అభివృద్ధిలో  ముందుకు సాగుతున్నామని ఏపీ రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుండి సహకారం లేదనేదే తమ బాధ అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ అసెంబ్లీలో జాతీయ పతాకాన్ని  బుధవారం నాడు ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.  అమరావతిలో  నాలుగోసారి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. 

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిందన్నారు. 72 ఏళ్లుగా దేశం ఎంతో ప్రగతి సాధించిన విషయాన్నిఆయన గుర్తు చేశారు.  అనంతరం శాసనమండలి ఆవరణలో జాతీయ  పతాకాన్ని మండలి ఛైర్మెన్ ఎన్ఎండీ ఫరూక్ ఆవిష్కరించారు. 

రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోందన్నారు.  పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం సస్యశ్యామలమయ్యే అవకాశం ఉందన్నారు. పోలవరం పూర్తైతే  ఏపీ అభివృద్ధిలో ఏపీ మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


 

loader