విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్లిన అక్కా చెల్లెళ్లలో ఓ యువతి ఇంటికి చేరుకొంది. మరో యువతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నెల 4వ తేదీన ఇద్దరు యువతులు  తమ తల్లి జ్యోతి ఆరోగ్యం బాగాలేదని, ఆమెకు సహాయం చేయాలని కోరేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పి వెళ్లారు. అప్పటి నుండి వారిద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ విషయమై యువతుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యోతి రెండో కుమార్తె మంగళవారం నాడు ఇంటికి చేరుకొంది. ఆమెను పోలీసులు విచారించారు. ఏలూరులో తాను చదువుకొన్న  పాఠశాలలో సర్టిఫికెట్లు తెచ్చుకొనేందుకు వెళ్లినట్టు ఆ యువతి పోలీసులకు చెప్పింది.

తన అమ్మ్మ ఇంటి వద్దే ఉన్నానని ఆమె చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే తన అక్క  ఈ నెల 5వ తేదీనే ఏలూరు నుండి విజయవాడకు వచ్చిందని  ఆమె పోలీసులకు చెప్పారు. జ్యోతి పెద్ద కుమార్తె ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

చింతమనేని సహాయం కోసం వెళ్లిన అక్కాచెల్లెళ్ల అదృశ్యం