వైసిపితో టచ్ లో ఉన్న గాలి, బొజ్జల కొడుకులు

వైసిపితో టచ్ లో ఉన్న గాలి, బొజ్జల కొడుకులు

మాజీ మంత్రులు గాలిముద్దుకృష్ణమనాయుడు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డిల వ్యవహారంపై టిడిపిలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే, వీరి పుత్రరత్నాలిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయంపై టిడిపిలో పెద్ద చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డిలకు నగిరి, శ్రీకాళహస్తిలో టిక్కెట్లు వచ్చేది అనుమానమే. వారి వయస్సు, అనారోగ్యాలను దృష్టిలో పెట్టుకుని టిక్కెట్లపై వారికి చంద్రబాబునాయుడు కూడా హామీ ఇవ్వలేదట. అందుకనే ఇద్దరు మాజీ మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో తమ పిల్లలకు టిక్కెట్లు ఇవ్వమని చంద్రబాబును అడిగారు. అయితే, ఆ విషయంలో కూడా చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ దక్కలేదట. దాంతో ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు.

అందుకనే ఎందుకైనా మంచిదనకుని ప్రత్యమ్నాయంగా ఇప్పటి నుండే వైసిపి నేతలతో కూడా టచ్ లో ఉన్నారట. ఒకవేళ తమ పిల్లలకు టిడిపిలో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వైసిపిలో చేరి టిక్కెట్లు తెచ్చుకోవాలన్నది మాజీ మంత్రుల ఆలోచనగా టిడిపిలో చర్చ జరుగుతోంది.  అయితే, ఇన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న నేతలను కాదని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రుల కొడుకులు బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రసాద్ లకు టిక్కెట్లు ఇస్తారా అన్నది అనుమానమే.

ఎందుకంటే, నగిరి నియోజకవర్గం సమస్యల పరిష్కారంపై ఎంఎల్ఏ రోజా బాగానే పోరాటం చేస్తున్నారు. ఇంటా, బయట కూడా రోజాకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అంటువంటి  రోజాను కాదని ముద్దు కృష్ణమనాయుడు కొడుకు భానుప్రసాద్ కు జగన్ టిక్కెట్టిచ్చేది అనుమానమే. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎక్కడ టిక్కెట్లు వస్తుందో ఇపుడే ఎవరూ చెప్పలేరు. కాకపోతే వైసిపి నేతలతో టచ్ లో ఉన్న మాజీ మంత్రుల వ్యవహారంపై మాత్రం టిడిపిలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page