హిజ్రా వేషధారణలో వచ్చిన ఆయన పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అటువైపు వచ్చారు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. కాగా.. అందరిలోకెల్లా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాత్రం ఢిపరెంట్ గా నిరసన తెలిపారు. రోజుకో విచిత్ర వేషదారణలో పార్లమెంట్ కి చేరుకొని అక్కడ తన నిరసనను తెలిపారు. 

ఇందులో భాగంగా శుక్రవారం శుక్రవారం హిజ్రా వేషధారణలో వచ్చిన ఆయన పార్లమెంటు భవనం ప్రధాన ద్వారం ముందు నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అటువైపు వచ్చారు.అక్కడే ఉన్న శివప్రసాద్‌ను చూసి పలకరించారు. ‘గుడ్‌.. బాగా చేస్తున్నారు. మీరు మంచి యాక్టర్‌’’ అని సోనియా ప్రశంసించారు. అందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శివప్రసాద్ తోపాటు ఇతర ఎంపీలు కూడా తమ నిరసనను తెలియజేశారు. ప్లకార్డులు పట్టుకొని పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేశారు. అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, టీజీ వెంకటేశ్‌, మురళీమోహన్‌, మాగంటి బాబు, అవంతి శ్రీనివాస్‌, మాల్యాద్రి శ్రీరాం, తోట సీతారామలక్ష్మి, నిమ్మల కిష్టప్ప, కనకమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని పాల్గొన్నారు.