అనారోగ్యంతో తండ్రి మృతిచెందగా... అది జీర్ణించుకోలేని కొడుకు అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బసాపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  గ్రామానికి చెందిన బీసన్న(75), మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఓబులేసు(43), దొడ్డయ్య. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులకు వివాహం జరిగింది. కాగా... ఓబులేసుకి మొదటి నుంచి తండ్రి అంటే అమితమైన ప్రేమ. కాగా... పదిరోజుల క్రితం ఓబులేసు అనారోగ్యానికి గురయ్యాడు.

అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో.. ఆదివారం కన్నుమూశాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓబులేసు... వెంటనే కుప్పకూలాడు. వెంటనే ఓబులేసును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అతను కూడా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

తండ్రి, కొడుకులు ఒకేసారి కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఓబులేసుకి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.