బిడ్డకు ఏమైనా తల్లి తట్టుకోలేదు. తాను జన్మనిచ్చిన బిడ్డకు ఏమైనా అయితే ఆ తల్లి గుండె విలవిలలాడిపోతుంది. కొంతమంది పిల్లలే ప్రపంచంగా బతికేవారైతే ఆ పిల్లలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారు కూడా బతకలేని పరిస్థితి. అంతటి పవిత్రమైనది మాతృత్వం. అలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొడుకు బలవన్మరణానికి పాల్పడితే కొడుకు మరణవార్త విని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
తిరుపతి: బిడ్డకు ఏమైనా తల్లి తట్టుకోలేదు. తాను జన్మనిచ్చిన బిడ్డకు ఏమైనా అయితే ఆ తల్లి గుండె విలవిలలాడిపోతుంది. కొంతమంది పిల్లలే ప్రపంచంగా బతికేవారైతే ఆ పిల్లలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారు కూడా బతకలేని పరిస్థితి. అంతటి పవిత్రమైనది మాతృత్వబంధం.
అలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొడుకు బలవన్మరణానికి పాల్పడితే కొడుకు మరణవార్త విని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే ఆర్థిక ఇబ్బందులు తాళలేక టీటీడీ కాంట్రాక్ట్ కార్మికుడు గంగాధర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంగాధర్ ఆత్మహత్య చేసుకోవడం చూసిన కుటుంబ సభ్యులు వెంటనే కిందకి దించి దగ్గరలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగాధర్ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న గంగాధర్ తల్లి కుప్పకూలిపోయింది.
కొడుకు మరణవార్త విని తట్టుకోలేక ఆ తల్లి ఆస్పత్రి ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించడం, కుమారుడి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఒకే ఇంట్లో ఇద్దరు బలవన్మరణాలకు పాల్పడటంతో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
